పెద్దపల్లి, 29-07-2026
పెద్దపల్లి నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణరావు గారు సూచించారు. పాత ఇళ్ల గోడలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున, అలాంటి ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణరావు గారు సూచించారు.
పాత ఇళ్ల గోడలు కూలే అవకాశం ఉందని, అలాంటి ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్ల వద్ద పిల్లలు ఆడుకోకుండా చూడాలని, తడి చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోవద్దని హెచ్చరించారు.
భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయని, వాగులు, కుంటల వద్దకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. రైతులు, మత్స్యకారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ సర్పంచులు ఎప్పటికప్పుడు గ్రామాలను పర్యవేక్షిస్తూ ప్రజలకు సూచనలు చేయాలని, అధికారులు 24/7 అందుబాటులో ఉండి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ప్రజల ప్రాణాలకు, ఆస్తికి ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అవసరమైనచోట సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని విప్ గారు తెలిపారు. విపత్తు సమయంలో 100, 108 మరియు స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించాలని కోరారు.









