మంచేరియల్, శుక్రవారం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్టిపి ఏరియాలో డీజీఎం(యాష్) గా పనిచేసి, బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గా బదిలీ అవుతున్న శ్రీ ఎనగందుల స్వామిరాజుకు ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను జిఎం శ్రీ ఎం. నరసింహారావు కొనియాడారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్టిపి ఏరియాలో డీజీఎం(యాష్) గా విధులు నిర్వహించిన శ్రీ ఎనగందుల స్వామిరాజు గారు బదిలీపై బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గా వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిఎం(ఎస్టిపిపి) శ్రీ ఎం. నరసింహారావు మాట్లాడుతూ స్వామిరాజు గారు ఎస్టిపిపిలో దాదాపు 11 నెలలు పనిచేశారని, ఈ కాలంలో ఫ్లై యాష్ వినియోగంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఉద్యోగులతో సౌమ్యంగా, అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వర్తించారని అన్నారు. బదిలీలు సహజమని, ఎక్కడికి వెళ్లినా సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
అనంతరం స్వామిరాజు మాట్లాడుతూ ఎస్టిపిపిలో తన విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎజిఎం(ఈ&ఎం) సూర్యనారాయణ రాజు, ఎజిఎం(ఫైనాన్స్) బి. శ్రీధర్, సిఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతుల, డిజిఎం(ఎన్విరాన్మెంట్) వాసుదేవ మూర్తి, ఎస్వో టు ఈడి వెంకటయ్య, ఎస్ఈ(ఈ&ఎం) కె.వి. శ్రీనివాస్, మేనేజర్ ఫారెస్ట్ చంద్రమణి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.











