మంచేరియల్, 08-07-2026
59వ డివిజన్ కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో SIR ఫారాలను నింపడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ ప్రజలందరికీ ఫారాలు నింపడంలో సహాయం అందించారు.
59వ డివిజన్ కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలకు SIR ఫారం ఎలా నింపాలో తెలియని వారి కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
డివిజన్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, తన మిత్రుల సహకారంతో డివిజన్ ప్రజలందరికీ SIR ఫారాలను నింపి పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ కార్తీక్ మరియు BLOలు పాల్గొని ప్రజలకు ఫారం నింపడంలో సహాయ సహకారాలు అందించారు. డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
SIR ఫారాల నింపుదలలో ఎలాంటి గందరగోళం లేకుండా, అందరికీ సకాలంలో పేర్లు నమోదయ్యేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు డివిజన్ ప్రజలు కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎవరూ కూడా ఓటు హక్కును కోల్పోకుండా అందరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.












