మంచేరియల్, 2026-07-02
అమెరికాలో అనారోగ్యంతో బాధపడుతున్న మంచిర్యాల యువతి లగిశెట్టి స్పందన కుటుంబానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు. చికాగోలో MS చదువుకుంటున్న స్పందన, ప్రమాదవశాత్తు కిందపడి కోమాలోకి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రులకు సహాయం అందించారు.
మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అమెరికాలో అనారోగ్యంతో బాధపడుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కుమార్తె లగిశెట్టి స్పందన కుటుంబానికి అండగా నిలిచారు. MS చదువుకోవడానికి అమెరికాలోని చికాగో వెళ్లిన స్పందన, ఇటీవల మెట్రో స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంటనే స్పందించి, స్పందన తల్లిదండ్రులకు అమెరికా వెళ్లేందుకు సీఎంఓ అధికారులతో మాట్లాడి పాస్పోర్ట్, వీసా మంజూరు చేయించారు. అంతేకాకుండా, విమాన టికెట్ తో పాటు ఇతర ఖర్చుల నిమిత్తం మూడు లక్షల రూపాయలను (3,00,000) అందజేశారు. భగవంతుడి ఆశీస్సులతో స్పందన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.












