*" (ప్రజావార్త) జూలై 31
మంచ్యా జ్ా జైూ్ మండం టేకుమట్ వాగుో వద ్వాహం ెగ ్జు ఇబ్బందుు డుతు్ ేథ్యంో, ాష్ట్ కా్మక ాఖ మంత్ డాక్ట్ వవేక్ వెంకటస్వామ సంఘటా స్థాక చేుకు స్థత స్వయంగా ంచాు. ఈ వాగుై 11.6 కోట్ ూాయతో 3 బ్డ్జ ్మాణం త్వో ్ాంభమవుతుంద మంత్ తెాు.
జైపూర్ మండలం టేకుమట్ల వాగులో వరద ప్రవాహం పెరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని టేకుమట్ల కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్లారు.
సమాచారం అందిన వెంటనే మంత్రి గారు టేకుమట్ల వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి వరద ప్రభావాన్ని అంచనా వేశారు.
టేకుమట్ల వాగుపై 11.6 కోట్ల రూపాయలతో 3 బ్రిడ్జిల నిర్మాణానికి ఇప్పటికే సాంక్షన్ వచ్చిందని మంత్రి వెల్లడించారు. అతి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి గారికి టేకుమట్ల కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. "ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ధ్యేయం" అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.











