మంచేరియల్, July 10
జర్నలిస్టులకు బస్సు పాసుల్లో పూర్తి రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టి.డబ్ల్యూ.జె.ఎఫ్.) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల డిపో సహాయ నిర్వాహకురాలు శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి మధు, ప్రధాన కార్యదర్శి సత్యగౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల విధి నిర్వహణకు బస్సు ప్రయాణం అత్యంత అవసరమని, అందువల్ల పూర్తి రాయితీతో పాసులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోడూరి శ్రీనివాస్, సతీష్, సందీప్, రాజేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.