మంచేరియల్, 2026-07-09
మంచిర్యాల నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి భవన నిర్మాణ పనులను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పరిశీలించారు. ఈ పర్యటన 09-07-2026న జరిగింది.
మంచిర్యాల నియోజకవర్గంలో 09-07-2026న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ గారు, స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి - యువరాజ్ గారు, మాజీ కౌన్సిలర్ కిషన్ గారు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












