మంచేరియల్, జూలై 08, 2026
రామకృష్ణాపూర్ పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి చిత్రపటాలకు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. సింగరేణి అభివృద్ధికి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారు ప్రశంసించారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి చిత్రపటానికి బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అరుమూళ్ళ పోశం మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్, ఏడాదికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ద్వారా దాదాపు 1200 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. తాడిచర్ల -2 కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బంగారి వేణుగోపాల్, కట్ట ఈశ్వరాచారి, పట్టణ ఉపాధ్యక్షులు కూన్సత్ సంతోష్ నాయక్, ముద్దసాని శ్రీనివాస్, మోటుకూరి దేవేందర్, మామిడాల రాజయ్య, గోపతి సత్యనారాయణ, ఉర్సు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.











