మంచేరియల్, 2026-09-10
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి కోరుతూ మంచిర్యాల జిల్లా అధికారులు వినతి పత్రం సమర్పించారు. న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అనుమతి కోసం నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు.
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి TGEJAC రాష్ట్ర కమిటీపిలుపు మేరకు చలో హైదరాబాద్ అనుమతి కొరకు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారికి వినతి పత్రం.* తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ గారి సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తేదీ 10.09.2026 గురువారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమం కొరకు జిల్లా స్థాయిలో అనుమతి కొరకు TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి మరియు సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గార్ల ఆధ్వర్యం లో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు అందరు పాల్గొంటారని వినతిపత్రం ఇవ్వడం జరిగినది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగినది. తదుపరి మంచిర్యాల జిల్లా గౌరవ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీ పి.చంద్రయ్య ఐఏఎస్ సార్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం గురించి వివరించడం జరిగినది. అడిషనల్ కలెక్టర్ సార్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగినది. ఇందులో TGEJAC మంచిర్యాల జిల్లా **కో-చైర్మన్లు* ఎస్. కిషన్, శ్రీనివాస్ దేశ్ పాండే, దుర్గా ప్రసాద్ పొన్న మల్లయ్య, రౌఫ్ ఖాన్, సురేఖ,శ్రీపతి బాపురావు *డిప్యూటీ సెక్రటరీ జనరల్* అత్తే సుధాకర్ , బొడ్డు శ్రావణ్ కుమార్ *వైస్ చైర్మన్* సునీత *పబ్లిసిటి సెక్రటరీ* రాంకుమార్ సెక్రటరీలు నడిమెట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి తిరుపతి, అజయ్ TGEJAC నాయకులు, టీజీవో,టీఎన్జీఓ, నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు నాయకులు మరియు జిల్లా లోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.











