మంచేరియల్, 2026-06-05
గత 20 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాలన వైఫల్యం చెందడం వల్లే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు విజిత్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత 20 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాలన వైఫల్యం చెందడం వల్లే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు విజిత్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుపై విమర్శలు
ఎల్లంపల్లి ప్రాజెక్టును తానే కట్టించానని గొప్పలు చెప్పుకుంటున్న దివాకర్ రావు, ప్రాజెక్ట్ సాధన కోసం ఆయన చేసిన పోరాటం ఏంటని వెంకటేశ్వర్ గౌడ్ ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఆయన కనీసం ఒక్క ధర్నా లేదా వినతి పత్రం అయినా సమర్పించారా అని నిలదీశారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నందుకే ఆయనకు ఎల్లంపల్లి దివాకర్ రావు అనే పేరు వచ్చిందని, కానీ ముంపు బాధితులకు ఆయన చేసింది శూన్యమని విమర్శించారు. ఎల్లంపల్లి బాధితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, పెండింగ్లో ఉన్న పరిహారాన్ని మీ హయాంలో ఎందుకు చెల్లించలేదని నిలదీశారు.
రైతుల సమస్యలపై బీజేపీ పోరాటం
ఎల్లంపల్లి బాధితులకు పెండింగ్లో ఉన్న పరిహారం చెల్లించాలని రఘునాథ్ గారు, బీజేపీ నాయకులు నిరసనలు, ఆందోళనలు చేస్తే, మీ బీఆర్ఎస్ హయాంలో రఘునాథ్ గారిపై రెండు అక్రమ కేసులు నమోదు చేసిన నీచమైన చరిత్ర మీదని వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. రైతుల కోసం రఘునాథ్ గారు ఏం చేశారని ప్రశ్నించిన విజిత్ రావుకు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హయాంలో వడ్ల ప్రతి బస్తాకు 3 నుంచి 5 కిలోల కటింగ్ పెట్టి రైస్ మిల్లర్ల వద్ద కమిషన్ తీసుకుని రైతులను దోచుకున్నారని ఆరోపించారు. దండేపల్లి నుంచి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి రైతుల పక్షాన పోరాడిన నాయకుడు రఘునాథ్ గారని తెలిపారు.
గూడెం లిఫ్ట్ సమస్యలపై ఒత్తిడి
గూడెం లిఫ్ట్ పైపులు తరచూ పగిలిపోతుంటే, వాటిని మార్చాలని ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది మా రఘునాథ్ గారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల తర్వాత, ఇప్పుడు విజిత్ రావు బయటకు వచ్చి తాము రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని, అసలు ఈరోజు రైతుల పరిస్థితి ఇలా ఉండటానికి కారణం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వైఫల్యమేనని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు
బీజేపీ కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ఎందుకు అధికారంలోకి రావడం లేదని అంటున్న విజిత్ రావు, 2023 ఎన్నికల ముందు పంజాబ్ రాష్ట్రానికి వెళ్లి తెలంగాణ ప్రజల సొమ్మును అక్కడి రైతులకు పంచిన కేసీఆర్, మహారాష్ట్ర, ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించిన కేసీఆర్, ఆయా రాష్ట్రాల్లో ఎన్ని సీట్లలో పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సలహాలు తీసుకునే స్థితిలో బీజేపీ లేదని, ఏ రాష్ట్రంలో ఎప్పుడు, ఎలా అధికారం దక్కించుకోవాలో మా అగ్ర నాయకత్వం చూసుకుంటుందని హితవు పలికారు.











