లక్షెట్టిపేట (ప్రజావార్త) ఆగస్టు 10
మంచ్యలనయోజవ్ప్జల,ైతంంమజీశసనసభ్యలలదు:నడపెల్లదవ్వనయత్వన్నమళ్ళీోంటన్నన,ఇదఓ్వలనబజెప,ం్ెస్నయలఅసత్యప్చలమొదలపెట్టనబఆ్ఎస్ప్టీష్ట్నయలనడపెల్లవజత్మ్వమ్శంచ.ల్షెట్టపటపట్టణంలోనఐబెస్ట్హౌస్ప్ంణంలోఏ్పటచసనవలలసమవశంలోఆయనమట్లడ.
మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, రైతాంగం మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారని, ఇది ఓర్వలేకనే బిజెపి, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ విమర్శించారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఐబి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి నాయకులకు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు విదేశాలలో ఉన్న ఆస్తులను నిరూపిస్తానని, సవాల్ స్వీకరించాలని ఆయన సవాల్ విసిరారు.
అభివృద్ధి, ప్రాజెక్టులపై ముఖ్యాంశాలు
దివాకర్ రావు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి పాదయాత్రకు పిలుపునివ్వడంతోనే ప్రభుత్వం దిగివచ్చి కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేసిందని విజిత్ కుమార్ తెలిపారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించి రైతును రాజు చేసిన ఘనత కూడా దివాకర్ రావు గారిదేనని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీపూర్వెంకటరావుపేట బీటీ రోడ్డు (8 కోట్లు), హనుమంతుపల్లితలమల రోడ్డు (10 కోట్లు), వెళ్గానూర్కొమ్ముగూడెం రోడ్డు (6 కోట్లు) తో పాటు అనేక గ్రామాల్లో బీటీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేయించింది దివాకర్ రావు నని తెలిపారు.
మంచిర్యాల ప్రగతి
మంచిర్యాలను జిల్లాగా మార్చడం, మెడికల్ కాలేజీ తీసుకరావడం, లక్షెట్టిపేటను మున్సిపాలిటీ చేసి ప్రతి వార్డుకు కోటి రూపాయలకు పైగా నిధులు కేటాయించడం, అత్యుత్తమ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం దివాకర్ రావు హయాంలోనే సాధ్యమయ్యాయని విజిత్ కుమార్ పేర్కొన్నారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు
బిజెపి పాలిత ప్రాంతాల్లో నిర్మించిన వంతెనలు, రోడ్లు, విమానాశ్రయాలు స్వల్ప కాలంలోనే దెబ్బతింటున్నాయని, అక్కడ విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. బిజెపి నాయకుడు ఎర్రబెల్లి రఘునాథ్ రావు స్వార్థ రాజకీయాల కోసం పదవులు కోరుకుంటున్నారని, సొంత కార్యకర్తలపై దాడులు జరిగినా పట్టించుకోకుండా ఎమ్మెల్యేతో అంతర్గత ఒప్పందాలు (మంచిర్యాలలో కుస్తీ - హైదరాబాద్లో దోస్తీ) చేసుకుంటున్నారని విమర్శించారు.
రాబోయే ఎన్నికలపై ధీమా
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి కంటే బిఆర్ఎస్ పార్టీకే 6,328 ఓట్లు ఎక్కువ వచ్చాయని, 2028లో మళ్ళీ తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని విజిత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సవాల్












