మహబూబ్నగర్, 2026-08-12
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ ఎర్ర సత్యం వర్ధంతి సభలో రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ఎర్ర సత్యం ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు.
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ ఎర్ర సత్యం వర్ధంతి సభలో రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ఎర్ర సత్యం ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు. సత్యమన్న పేరు వినని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరన్నారు.
పేదల సంక్షేమానికి ఎనలేని సేవలు
ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రతి పేదవాడి గుండెలో సత్యమన్న బ్రతికే ఉన్నాడని తెలిపారు. పండగ సాయన్న తర్వాత పేదవాళ్లకు న్యాయం చేసిన మహోన్నత వ్యక్తి సత్యమన్న అని ఆయన కొనియాడారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి సత్యమన్న అని మంత్రి పేర్కొన్నారు.
స్ఫూర్తిదాయక జీవితం
పండగ సాయన్న స్ఫూర్తితో పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచిన మహానుభావుడని తెలియజేశారు. సత్యమన్న సేవలను జయంతి, వర్ధంతి రోజుల్లో కాకుండా ప్రతీ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారికి అండగా నిలిచిన ఎర్ర సత్యం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, సాట్స్ మాజీ చైర్మన్ శివసేనా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ఎర్ర సత్యం కుటుంబ సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.











