మంచేరియల్, 2026-06-28
మంచిర్యాల నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియపై మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు దృష్టి సారించారు. ఆమె ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. అనంతరం పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసిన ఆమె, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3, 26, 27, 32, 49, 50 డివిజన్లలో BLOలు, BLAలు ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు.
అనంతరం 26వ డివిజన్లో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు సురేఖమ్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, అప్రమత్తంగా లేకపోతే అర్హత ఉన్న ఓట్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి ఇంటికి వచ్చే ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












