మంచేరియల్, 2026-06-27
కయాతనపలలిమునసిపాలిటీ18వవారడులోకాంగరెసనాయకులుసపెషలఇంటెనసివరివిజనకారయకరమాననినిరవహించారు.58,74వబూతలలోలతోకలిసిఇంటింటికీవెళలిఓటరలవివరాలనుసేకరించారు.దవారాఓటరలగురతింపుపరకరియనుపటిషటంచేసి,ఎననికలఅవకతవకలనుఅరికటటవచచనినాయకులుతెలిపారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ 18వ వార్డు పరిధిలోని 58, 74వ నంబర్ బూత్‌లలో కాంగ్రెస్ నాయకులు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బూత్‌లలోని బూత్ లెవల్ ఏజెంట లతో కలిసి, ఎస్సై ఆర్ పర్యవేక్షణలో భాగంగా వార్డులోని ఇళ్లను సందర్శించి, ఓటర్ల ప్రాధాన్యతలను తెలుసుకున్నారు.
ఎస్ ఐ ఆర్ వలన ఖచ్చితమైన, నిజమైన ఓటర్ గుర్తింపు ప్రక్రియ సాధ్యమవుతుందని, తద్వారా ఎన్నికలలో జరిగే అవకతవకలను నిరోధించవచ్చని ఈ సందర్భంగా కాలనీ ఓటర్లకు తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక బాధ్యతాయుతమైన పనిగా బి ఎల్ ఏ లు, మరియు కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ 2 ఏజెంట్లు కలిసికట్టుగా సమగ్ర విచారణ చేసి, డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్లను గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టౌన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బత్తుల శ్రీనివాస్, బి ఎల్ ఏ 2 ఏజెంట్లు రాగిశెట్టి రాజన్న, సల్మాన్ జిబ్బు, నాగరాజ్, రాజన్న, ఇబ్రహీం, రవీందర్, పసరగొండ కృష్ణకాంత్ మరియు BLAలలో గంగా, మంగ పాల్గొన్నారు.












