Mancherial/Jaipur (ప్రజావార్త) జూన్ 28
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం జైపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ కూన భాస్కర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత సమాజం నిర్మించడంలో అందరి భాగస్వామ్యం కీలకమని ఆయన తెలిపారు.
జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కూన భాస్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజం నిర్మించడం మన అందరి బాధ్యతన్నారు. రెండు చుక్కలు పిల్లలకు జీవితాంతం రక్షణగా నిలుస్తాయని తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్, వార్డు సభ్యులు ప్రశాంత్ రెడ్డి, ఇరిగిరాల మనోహర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. ముస్తఫా పాల్గొన్నారు.











