పట్టణంలో నిన్న సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, కార్యకర్తల సమ్మేళనం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, ఆయన సతీమణి స్రవంతి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకల్లో, స్రవంతి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, అందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతిని ప్రతిబింబించేలా పండుగలు జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే, దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











