మండలం జీలకుంట గ్రామంలో రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, తారు రోడ్డు మరియు లైటింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాలకు మహర్దశ అని, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని ఆయన అన్నారు.
మండలం జీలకుంట గ్రామంలో రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, తారు రోడ్డు మరియు లైటింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల వలె ముందుకు సాగుతున్నాయని, పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మండలం జీలకుంట గ్రామంలో రూ. 25 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను, సీసీ రోడ్లను ప్రారంభించుకోవడం జరిగిందని, కాంగ్రెస్ సర్కార్లో గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని గుర్తు చేశారు.
మండలంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజలు తమ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారాన్ని రోడ్లపై వేయకూడదని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.












