తమ స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టే స్థాయికి రాజకీయ పార్టీలు దిగజారాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. భారతదేశమంతా 1947లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటే, 13 నెలల పాటు నిజాం నవాబు, రజాకార్ల వేధింపులకు గురై, ఆపరేషన్ పోలో ద్వారా స్వేచ్ఛ పొందిన తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినం పేరుతో గోల్కొండపై జెండా ఎగరేసి, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను అటకెక్కించిందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరుతో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు దూరంగా ఉందని అన్నారు. రెండు రాజకీయ పార్టీలు మైనారిటీల సంతృప్తి కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టాయని ఆయన ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీ గల్లీలో ప్రతి కార్యాలయంలో, ప్రతి విద్యా సంస్థలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించి, తెలంగాణ విమోచన కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గమ్మ అశోక్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, స్టేట్ మీడియా ప్యానలిస్ట్ తుల ఆంజనేయులు, మంచిర్యాల సీనియర్ నాయకులు పురుషోత్తం రాజు, పెద్దపల్లి పురుషోత్తం, గోలి రాము, కోయ్యాల ఎమాజీ, జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ, అక్కల రమేష్, కమలాకర్ రావు, జోగుల శ్రీదేవి, జిల్లా కార్యదర్శి వైద్య శ్రీధర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బియ్యాల సతీష్ రావు, సోషల్ మీడియా కన్వీనర్ జయరామ్ రావు, జోనల్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు, కుర్రి చక్రవర్తి, రంగ శ్రీశైలం, బీసీ మోర్చా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ప్రేమ్ సింగ్ రాథోడ్, యువమోర్చా అధ్యక్షులు ఏతం శివకృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్న, జిల్లా కార్యాలయ కార్యదర్శి తోట మల్లికార్జున్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











