తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసంలో జాతీయ జెండాను మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు, నియోజకవర్గంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే నివాసం వద్ద జాతీయ జెండాను జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా చైర్మన్ వొడ్డే రాజమౌళి పాల్గొన్నారు.
కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











