Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 26
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత చేపట్టిన పార్లమెంట్ ముట్టడి ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ ఉద్యమం కారణంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయరాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు హెచ్చరించారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసి, నీట్ విద్యార్థులను ఆదుకోవాలని దేశంలోని యువత పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ ఉద్యమానికి వేలాది మంది తరలి మద్దతుగా నిలిచారు. ఉద్యమం ఉదృతం కావడంతో కేంద్రం నిరసనకారులతో చర్చలు జరిపి డెడ్లైన్ పెట్టింది. డెడ్లైన్కు ముందే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు.
యువకులు తలుచుకుంటే దేశ రాజకీయాలే తలకిందులవుతాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి హెచ్చరించారు. సుప్రీంకోర్టు సీజేఐ యువత బద్ధకస్థులు, బొద్దింక పురుగుల్లా తయారయ్యారనే విమర్శలకు కారణమైన ఈ జెంజి ఉద్యమానికి దారి తీసిందని, "యూత్ పవర్ ఈజ్ నేషనల్ పవర్" అని, యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని ఈ ఉద్యమం ద్వారా తెలుసుకోవాలని అన్నారు.
ఇకనైనా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధ్యతగా పని చేయాలని ఆయన కోరారు.











