హైదరాబాద్, 2026-08-07
జనగణన2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన గ్రామ, పట్టణ డైరెక్టరీల వివరాల సేకరణను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె ఈ సూచనలు చేశారు.
జనగణన2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన గ్రామ డైరెక్టరీ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.
సమాచార సేకరణపై శిక్షణ
ఈ సందర్భంగా రాష్ట్ర జనగణన సంచాలకులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం, న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర జనగణన సంచాలకుల కార్యాలయం మార్గదర్శకాల మేరకు జిల్లాల పరిధిలోని అన్ని చార్జ్‌ల పరిధిలో ఫీల్డ్ ఫంక్షనరీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణల ద్వారా సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ఏకరూపత, ఖచ్చితత్వం, నాణ్యతను నిర్ధారించేందుకు సమగ్ర అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు.
హ్యాండ్‌బుక్‌లో చేర్చాల్సిన అంశాలు
గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, బ్యాంకింగ్ సేవలు, పోస్టల్ సేవలు, వ్యవసాయం, మార్కెటింగ్ సౌకర్యాలు, సామాజిక, ఆర్థిక మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసే విధానంపై క్షేత్ర సిబ్బందికి తగు శిక్షణ అందించాలని సూచించారు. చార్జ్ అధికారులు తమ పరిధిలోని ఫీల్డ్ ఫంక్షనరీలకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడంతో పాటు, వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ప్రతి గ్రామం, పట్టణానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు.
నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ
నమోదయ్యే ప్రతి సమాచారం సంపూర్ణంగా, ఖచ్చితంగా, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని భారతి హోళ్లికేరి సూచించారు. హ్యాండ్‌బుక్ పార్ట్ - ఎ లో గ్రామ, పట్టణ డైరెక్టరీలు, పార్ట్ - బి లో ప్రాథమిక గణన సారాంశం ఉంటాయని తెలిపారు. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్, అవసరమైతే భౌతిక షెడ్యూల్ ద్వారా సమాచార సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఛార్జ్ అధికారుల బాధ్యతలు
ఛార్జ్ అధికారుల బాధ్యతలు, ఫీల్డ్ సిబ్బంది నియామకం, యూజర్ ఐడీల సృష్టి, శిక్షణ నిర్వహణ, ఫీల్డ్ వర్క్ పర్యవేక్షణ, డేటా ధృవీకరణ, గౌరవ వేతనాల పంపిణీ, నిర్ణీత గడువులో పనుల పూర్తి వంటి అంశాలు పొందుపరచబడి ఉంటాయని, డేటా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ/పట్టణ కోడ్లు సక్రమంగా నమోదు చేయాలని, తప్పనిసరి వివరాలన్నీ నమోదు చేయాలని, డూప్లికేట్ సమాచారం లేకుండా సంబంధిత శాఖల రికార్డులతో సరిపోలే విధంగా సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు.












