తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ పాల్గొన్నారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.












