మంచిర్యాల (ప్రజావార్త) ఆగస్టు 14
మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

స్థల పరిశీలన
పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం 54వ డివిజన్ గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాత కార్యాలయ భవనాన్ని అధికారులు పరిశీలించారు. ఈ పరిశీలనలో భాస్కర్, ప్రకాష్, ప్రమోద్ రావు, ఫింగర్ ప్రింట్ , ఎస్ఐలు పాల్గొన్నారు.
త్వరలో ప్రారంభం
త్వరలోనే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, భాస్కర్ గారిని కోరారు. ఈ ప్రతిపాదనకు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.