Hanumakonda/Elkathurthi (ప్రజావార్త) నవంబర్ 24
హనుమకొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రేపటి నుండి ప్రతి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.
ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించే ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ప్రతి కుటుంబాన్ని కలిసి ఇందిరమ్మ బీమా పథకం గురించి పూర్తి అవగాహన కల్పించాలి. పథకం ప్రయోజనాలను వివరించి, అర్హులైన ప్రతి కుటుంబ సభ్యుడికి ఆన్లైన్ నమోదు చేయించాలని తెలిపారు.
ప్రతి ఇంటికి ఇందిరమ్మ బీమా పథకంపై అవగాహన కల్పించడం, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తిచేయించడం మనందరి బాధ్యత అని నొక్కి చెప్పారు.
కావున, ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని, ప్రజలకు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.







