మంచేరియల్, 2026-11-29
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి గ్రామంలోని .. గార్డెన్స్ లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి గ్రామంలోని .. గార్డెన్స్ లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివాస్ కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు పడ్డాయని అన్నారు. ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు.
నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, యువత, కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







