చెన్నూర్, 2026-11-25
మంచిర్యాల్ జిల్లాలోని గ్రామీణ స్థాయి వరకు బీజేపీ యువమోర్చా (బీజేవైఎం)ను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకుల మార్గదర్శనం, సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని వారు పేర్కొన్నారు.

ఈ రోజు చెన్నూర్ పట్టణం, మందమర్రి పట్టణం, మందమర్రి మండలాలలో జరిగిన సమావేశాల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు అక్కల రమేష్, జిల్లా కార్యదర్శి సంజీవ్ రావు, సీనియర్ నాయకులు దీక్షితులు, స్థానిక పట్టణ, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశాల్లో బీజేవైఎంను బలోపేతం చేయడంపై చర్చించారు. పార్టీ కార్యకలాపాలను గ్రామస్థాయిలో విస్తరించడం, యువతను పార్టీ వైపు ఆకర్షించడం వంటి అంశాలపై నాయకులు దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో యువమోర్చా ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.