మంచేరియల్, 8 September
ప్రజా జాగృతి సమితి సభ్యులు మంగళవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యుడు డా. సిరికొండ తిరుపతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుడి సేవలను కొనియాడారు.
ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా వైద్యుడికి సన్మానం : మంగళవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా జాగృతి సమితి సభ్యులు ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యుడు డా. సిరికొండ తిరుపతి ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడుతూ.. నడవలేని స్థితి నుంచి అడుగులు వేయించే ధైర్యం, నొప్పులతో కుంగిపోయిన శరీరానికి మళ్లీ ఉత్సాహాన్ని ఇచ్చే విశ్వాసం అదే ఫిజియోథెరపీ అని అన్నారు. ప్రమాదాలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, పక్షవాతం తదితర సమస్యల నుంచి కోలుకోవడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తూ విశేష సేవలు చేస్తున్న వైద్యులను గౌరవించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా జాగృతి సమితి సభ్యులు వీర్ల నాగరాజు, కల్లూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.












