కరపత్రికలను (ప్రజావార్త) సెప్టెంబర్ 08
కౌమార దశలోని పిల్లల ఆరోగ్యం, హక్కులపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం () కింద పోస్టర్లు, కరపత్రాలను మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి () డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం విడుదల చేశారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
మంచిర్యాలలో ‘రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య’ ప్రచార పత్రాల విడుదల మంచిర్యాల: కౌమార దశలోని పిల్లల ఆరోగ్యం, హక్కులపై విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం (RKSK) పోస్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు మరియు పాఠశాలల్లో 10 నుండి 19 ఏళ్ల వయస్సు గల బాలబాలికలకు (పీర్ గ్రూప్) ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌమార వయస్సులో ఎదురయ్యే శారీరక, మానసిక మార్పులపై నమ్మకం, గోప్యతతో కూడిన సలహాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రచారంలో ముఖ్యమైన అంశాలు: ఆరోగ్య సేవలు: లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, రుతుస్రావం, గర్భనిరోధం, రక్తహీనత, సంక్రమించని వ్యాధులు (మధుమేహం, బిపి) మరియు మానసిక ఒత్తిడి నివారణపై ఉచిత కౌన్సెలింగ్. వ్యసనాల నిర్మూలన: మద్యం, పొగాకు, సిగరెట్, గంజాయి వంటి దురలవాట్లకు దూరంగా ఉండేలా పిల్లలకు మార్గదర్శనం. మంచి స్పర్శ - చెడు స్పర్శ: అనుమానాస్పద స్పర్శలు ఎదురైతే గట్టిగా "వద్దు" అని చెప్పడం, అక్కడి నుండి దూరంగా వెళ్లడం, నమ్మకమైన వారికి తెలపడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫిర్యాదు చేయాలని సూచన. బాల్య వివాహాల నిరోధం: "మేము పిల్లలం అప్పుడే కాము తల్లులం" అనే నినాదంతో ప్రచారం చేపట్టాలన్నారు. బాల్య వివాహాల వల్ల అకాల గర్భం, ప్రసూతి మరణాలు, రక్తహీనత సంభవిస్తాయని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు: బాల్య వివాహ నిషేధ చట్టం-2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకు పెళ్లి చేయడం శిక్షార్హమైన నేరమని డిఎంహెచ్ఓ గుర్తుచేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1 లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సిహెచ్ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్టా సత్తయ్య, శ్రీనివాస్, ఆర్ఎస్ పద్మ, సుమన్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.












