జైపూర్, 3 October
మండలం పౌనూర్ గ్రామంలో సర్పంచ్ వెముల సుధ తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం జ్వర వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు.
మండలం పౌనూర్ గ్రామంలో సర్పంచ్ వెముల సుధ తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం జ్వర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు, జిల్లాలో జ్వర కేసుల నియంత్రణకు అక్టోబర్ నెలలో ప్రతిరోజూ ఒక్కో గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పౌనూర్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. ఈ శిబిరానికి మొత్తం 96 మంది హాజరుకాగా, 6 జ్వర కేసులను గుర్తించారు. వారికి మలేరియా, డెంగ్యూ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అన్నీ నెగెటివ్‌గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా పీహెచ్సీ కుందారం వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ, జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అందుబాటులో ఉన్న ఆశా కార్యకర్తను కానీ ఏఎన్ఎంను కానీ సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో నాందేవ్, హెచ్‌ఈవో అల్లాడి శ్రీనివాస్, ఏఎన్ఎం రాణి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, పౌనూర్ ఆశా కార్యకర్త రాజమణి, శివ్వరం ఆశా జ్యోతి, వేలాల ఆశా రాజిత, బీఆర్ఎస్ నాయకులు జగన్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












