పెద్దపల్లి, 15 September
పెద్దపల్లి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలని, మెరుగైన విద్యావ్యవస్థను అందిస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.. రేవంతన్న ప్రభుత్వంలో మెరుగైన విద్యావ్యవస్థ.. పెద్దపల్లి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల.. * రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్పాహార కార్యక్రమాన్ని హరే రామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఉదయ 9:00 గంటలకే హాజరవుతారని పిల్లల తల్లితండ్రులు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ, ఇతర పనుల నిమిత్తం ఉదయం 8 గంటలలోపే పనులకు వెళ్లిపోవడం జరుగుతుందని కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారు పౌష్టికంగా ఉండాలని నాణ్యమైన విద్యను అభ్యసించాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం మరియు పాలు పంపిణి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. వారానికి 6 రోజులు పిల్లలకు అల్పాహారం ఇడ్లీ సాంబార్, పూరీ ఆలుకుర్మ, దోస, ఉక్మా, మిల్లెట్ ఇడ్లీ సాంబార్, బోండా 6 రకాల టిఫిన్స్‌ను అందించడం జరుగుతుంది అని మన పిల్లలు బాగా చదువుకోవాలని విద్యావంతులు కావాలని మన ప్రాంతానికి గ్రామానికి మంచి పేరు తేవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే 65 కోట్ల రూపాయలతో పలు ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, కొత్త పాఠశాల భవన నిర్మాణాలు, టాయిలెట్స్, పాఠశాల బిల్డింగ్ ఆధునీకరణ మరియు పలు అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను ఆరోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిర్మాణం చేస్తే మోడల్, కస్తూర్బా పాఠశాలకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతోని సాంక్షన్ తీసుకొని దాదాపు 30 లక్షలతోని కాంపౌండ్ వాల్ ఇతర పనులను ప్రారంభించుకున్నాం అని అన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని కానీ మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్‌లో రెండున్నర సంవత్సరాలల్లో 65 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఇప్పటివరకు ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వచ్చి చదువుకుంటున్నరంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయో ఇదే నిదర్శనం అని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యావ్యవస్థపై 2 గంటల పాటు అసెంబ్లీలో చర్చించినప్పుడు రెండున్నర సంవత్సరాలలో విద్య వ్యవస్థ ఏ విధంగా మెరుగుపరిచామో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షుణంగా వివరించారని తెలిపారు. విద్యను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ముందు ఆలోచనతోని ఉందని అలాగే ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ప్రభుత్వం ప్రారంభించి 1600 విద్యార్థులతోని ఆ పాఠశాల నడుస్తోందని అలాగే రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య ప్రమాణాలను పెంచడమే కాకుండా విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం పనులు ప్రారంభించుకోవడం జరిగిందని పిల్లర్లు వరకు కూడా నిర్మాణం పూర్తి కావడం జరిగిందని సంవత్సర కాలంలో పాఠశాలను పూర్తిచేసుకుని బీసీ ఎస్సీ,మైనారిటీ,ఎస్టి హాస్టల్స్ విద్యార్థులను ఒకే దగ్గరికి చేర్చి ఒకే దగ్గర చదువుకునే విధంగా, ఎలాంటి కుల మత బేధాలు లేకుండా విద్య విషయంలో అందరూ సమానులే అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పొందే పేద విద్యార్థుల ఆకలి బాధలు తీర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమని వారికి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్,వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ, లు మండల పార్టీ అధ్యక్షులు,మరియు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












