మంచేరియల్, 2026-07-13
మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలోని కొలంగూడ గ్రామంలో రూ. 38.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేసి, గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం, హాజీపూర్ మండలంలోని కొలంగూడ గ్రామంలో రూ. 38.15 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు విద్యార్థులకు పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ గ్రామంలో 40 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని, వచ్చే దసరా పండుగ వరకు తానే స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
గ్రామస్థులు తమ మంచినీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారికి ఫోన్ చేసి అతి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ముందుగా గ్రామస్తులు, విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య గారు, సంబంధిత అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












