పెద్దపల్లి, 3 September
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు గారు బుధవారం సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతితో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి గారితో కలిసి స్వామి వారిని బుధవారం రోజున దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయ కట్టడాల మరియు ప్రత్యేక ఆకర్షితమైన అభివృద్ధి పనుల గురించి బుధవారం రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు సంబంధిత అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు గారికి దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరగాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు మల్లిఖార్జున స్వామి వారిని వేడుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థాన వేద పండితులు ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారికి వేద ఆశిర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ... శ్రీశైలం క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదని జ్యోతిర్లింగ క్షేత్రంగా దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల మల్లిఖార్జున స్వామి వారి ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి పలు నమూనాలను చూడటం జరిగిందని వాటి అనుగుణంగా అనుమతులు పొంది ఓదెల మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల మల్లన్న ఆలయ ఈ.వో, ప్రధాన అర్చకులు మరియు తదితరులు పాల్గొన్నారు.












