మంచేరియల్, 6 September
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటు, నిమజ్జన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు వంటి అంశాలపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన సూచించారు.
. వినాయక చవితి మండపాల మరియు నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని M కన్వెన్షన్ హాల్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల మరియు నిమజ్జన ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.. వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు సూచించారు.. మండపాల నిర్వాహకులకు అవసరమైన సహకారం అందిస్తూ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. మండపాల కమిటీ సభ్యులందరూ కూడా అధికారులందరికీ సహకరించాలని చెప్పారు.. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సింగరేణి GM శ్రీనివాస్, ACP ప్రకాశ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, ల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్, గుండ సుధాకర్ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు..











