దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా మంచిర్యాలలోని - వద్ద కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రుల సందర్భంగా జరిగిన ఈ ప్రత్యేక పూజల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ నస్పూర్ పట్టణ మాజీ అధ్యక్షులు అక్కురి సుబ్బన్న, టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు పెట్టం స్వరూప-లక్ష్మణ్, గుమ్మడి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు నాయకులు అమ్మవారిని దర్శించుకుని, పూజల్లో పాల్గొన్నారు.












