మంచేరియల్, July 17, 2026
నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో 12 సీసీ కెమెరాలను శుక్రవారం ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఈ ఏర్పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో 12 సీసీ కెమెరాలను శుక్రవారం ఏర్పాటు చేశారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, ఐపీఎస్ సూచనల మేరకు, మంచిర్యాల జిల్లా డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ వి. కిరణ్ కుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రమేష్, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జె. శ్రీధర్ పర్యవేక్షణలో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు, నేరస్తులను త్వరగా గుర్తించి పట్టుకోవడానికి, ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల సహకారంతో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను పోలీసులు అభినందించారు.












