మంచేరియల్, 6 September
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో గల ఫంక్షన్ హాల్లో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వైష్ణవ సమారాధన కార్యక్రమంలో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే కార్తీక మాసంలో సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని BMA ఫంక్షన్ హాల్ లో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వైష్ణవ సమారాధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ వచ్చే కార్తీక మాసంలో శ్రీ వైష్ణవ సంఘ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తానని తెలిపారు.. అనంతరం వైష్ణవ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని శాలువాతో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు..












