ఐటీడీఏ ఉట్నూర్ పరిధిలోని ఉద్యాన నర్సరీలను బలోపేతం చేసి, రైతులకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు (ఐఏఎస్) తెలిపారు.
శుక్రవారం నాడు ఐటీడీఏ అధికారులతో కలిసి మంచిర్యాల జిల్లా భీమారంలోని ఉద్యాన నర్సరీని ఆయన సందర్శించారు. అక్కడ పెంచుతున్న వివిధ రకాల మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అవసరమైన వసతుల కల్పనపై అక్కడి అధికారులు ప్రాజెక్టు అధికారికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా, నర్సరీలో అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రైతులకు ఉపయోగపడే అన్ని రకాల పంటలపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు అధికారి ఆదేశించారు.
వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని, రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని విధాలుగా అందేలా చూడాలని ఆయన సూచించారు.
ఈ సందర్శన కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యాన అధికారి నర్సయ్య, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి రమాదేవి, ఉద్యాన అధికారి సందీప్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












