జైపూర్ మండలంలోని 5 గ్రామాల్లో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జైపూర్ పోలీసులు చేపట్టారు. జైపూర్ ఎస్ఐ బుమేష్ సిబ్బందితో కలిసి ఇందారం, టేకుమట్ల, బెజ్జాల, రామారావుపేట, షెట్పల్లి గ్రామాల్లో పర్యటించారు.
వాహనదారులకు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ యువకులు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్ఐ బుమేష్ డిఫెన్సివ్ డ్రైవింగ్ యొక్క ఆవశ్యకతను వివరించారు. అతివేగంగా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు తెలియజేశారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించడం వంటి జాగ్రత్తలపై సూచనలు చేసారు.












