మంచేరియల్, 09.07.2026
రామగుండం CAR హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అంగల గోపి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం నిద్రలేవగానే అస్వస్థతకు గురై మరణించిన అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బెల్లంపల్లి మండలం, చాకపల్లి రాళ్లపేట గ్రామానికి చెందిన అంగల గోపి (35) మంచిర్యాలలోని పద్మశాలి కాలనీలో నివాసం ఉంటూ రామగుండం CAR హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్రలేచి బెడ్ దిగిన గోపి ఆకస్మాత్తుగా కింద పడిపోయి, వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని మంచిర్యాల మెడి లైఫ్ హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడికి భార్య స్వరూప, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచిర్యాల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








