హైదరాబాద్, 2026-08-28
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి తోబుట్టువులు ఆయనకు రాఖీలు కట్టి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి శ్రీహరి సంతోషంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీక అని, తోబుట్టువుల మధ్య అనురాగం, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు మంత్రికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.