జిల్లా కేంద్రంలోని ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, ఉత్సాహంగా ఆడి పాడారు.
జిల్లా కేంద్రంలోని ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, ఉత్సాహంగా ఆడి పాడారు. అనంతరం అంగన్వాడీ టీచర్ ఎన్. పద్మ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. పండుగల విశిష్టతను భావితరాలకు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ ఎన్. పద్మ, హెల్పర్ లత, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.











