జిల్లా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి, సెక్రటరీ శ్రీ హబీబ్ హుస్సేన్ ల నేతృత్వంలో ఐడిఓసి కమాను వద్ద 3, హైవే కమాన్ వద్ద 2 సీసీ కెమెరాలు బిగించారు.
జిల్లా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి, సెక్రటరీ శ్రీ హబీబ్ హుస్సేన్ ల నేతృత్వంలో కలెక్టర్ ఆఫీస్ రోడ్డులోని ఐడిఓసి కమాను వద్ద 3 సీసీ కెమెరాలు, హైవే కమాన్ వద్ద 2 సీసీ కెమెరాలు బిగించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్, మరియు పోలీస్ అధికారుల సూచనల మేరకు ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినా వాటిని గుర్తించడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆ ప్రాంతంలో భద్రత మరింత మెరుగుపడుతుందని, ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.












