సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలను ఆహ్వానించి, కార్మికుల సమస్యలపై చర్చించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో యాజమాన్
సింగరేణిలో 2027లో రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయని, అయితే గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు 9 నెలల ఆలస్యంతో లెటర్ తీసుకోవడం వల్ల ఈ కాలం గడిచిపోయిందని తెలిపారు. దీంతో కార్మికుల సమస్యలు పేరుకుపోతున్నాయని, ఈ నేపథ్యంలో యాజమాన్యం వెంటనే గుర్తింపు కాలపరిమితి ముగిసినందున అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలను ఆహ్వానించి చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
లేదంటే, కార్మిక సంఘాలను, కార్మికులను ఐక్యం చేసి కమిటీలు జరిగే సమయాలలో నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వాసు, సాయి, కీర్తి, శంకర్, రాజశేఖర్, వినయ్, అనిల్, సుధీర్, పాషా, రమేష్, అమర్, అఖిల్, కొమరయ్య, నవీన్ పాల్గొన్నారు.









