సమాజంలో సేవా కార్యక్రమాలు అందిస్తున్న వాసవిక్లబ్స్, క్రీడాస్పూర్తిని, యువత ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో జిల్లా స్థాయిలో బాక్స్ క్రికెట్ పోటీలను నిర్వహించింది. క్యాతనపెల్లి మున్సిపాలిటీలోని జెర్సీ 7 బాక్స్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో వాసవి యూత్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది.
వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు ముక్తా విశ్వాస్ సారధ్యంలో జరిగిన ఈ పోటీలను వాసవిక్లబ్స్ అంతర్జాతీయ సంస్థ అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు సింపురం రాజేశ్, ముక్త శ్రీనివాస్, కటుకం హరీష్ పర్యవేక్షించారు. ఉదయం నుండి రాత్రి పదిన్నర గంటల వరకు జరిగిన మ్యాచ్‌లలో ఫైనల్‌కు చేరిన మధురం జట్టుపై వాసవి యూత్ క్లబ్ జట్టు 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ పోటీలలో వాసవిక్లబ్, వాసవి యూత్ క్లబ్, మధురం టీం, చిలువేరు టీం, సిఎస్కె జట్టు, సూర్య జట్లు పాల్గొన్నాయి. నిర్వాహక వాసవి యూత్ క్లబ్ అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షించింది.
జిల్లా బాక్స్ క్రికెట్ పోటీల విజేతగా వాసవి యూత్ క్లబ్ జట్టు పది వేల రూపాయల నగదు బహుమతి, ట్రోఫీని అందుకుంది. రెండవ స్థానంలో నిలిచిన మధురం జట్టు 7500 రూపాయల పారితోషకం, రన్నర్ కప్ సాధించగా, తృతీయ స్థానంలో నిలిచిన చిలువేరు జట్టు 5000 రూపాయల పారితోషకం, సెకండ్ రన్నర్ కప్ గెలుచుకుంది. మొదటి బహుమతిని 59వ వార్డు కార్పోరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ, రెండవ బహుమతిని జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్, మూడవ బహుమతిని 43వ డివిజన్ కార్పోరేటర్ చిలువేరు జ్యోతి శ్రీనివాస్ అందజేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా తనుకు అరిత్, బౌలర్‌గా నాగిశెట్టి వర్సిత్, తనుకు అర్షిత్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా తనుకు అరిత్లు అవార్డులు కైవసం చేసుకున్నారు.
టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవంలో వాసవిక్లబ్స్ అంతర్జాతీయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్స్ అంతర్జాతీయ అధికారులు ముక్త శ్రీనివాస్, కటుకం హరీష్, ఆర్యవైశ్య సంఘం ఛైర్మన్ మాదంశెట్టి సత్యనారాయణ, రైసెమిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలువేరు వైకుంఠం, క్యాతనపెల్లి మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్, వాసవిక్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్, క్యాబినెట్ సెక్రటరి సేవ కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి కొంకుముట్టి వెంకటేశ్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అక్కెనపెల్లి రవీందర్, జిల్లా క్యాబినెట్ అధికారులు ఇరుకుల్ల శ్రీనివాస్, కాసం సతీష్, వుత్తూరి రమేష్, నాగిశెట్టి జ్యోతి, రీజియన్ ఛైర్మన్ సిద్దంశెట్టి మధుశ్రీ, జోన్ ఛైర్మన్లు ఇరుకుల్ల సూర్యనారాయణ, పాత సాయిసూరజ్, పడకంటి శ్రీనివాస్, వాసవిక్లబ్స్ అధ్యక్షుడు వెనిశెట్టి రాఘవేంద్ర, పడకంటి రజితతో పాటు నిర్వాహక కమిటీ సభ్యులు బొనగిరి ప్రసన్న, గండెశ్రీ అనీల్, కొండ కార్తీక్, బొనగిరి సాయి పాల్గొన్నారు.








