హైదరాబాద్, 6 September
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ కార్యాలయాన్ని ప్రభుత్వం కేటాయించింది. పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ఆదివారం రోజున వేద పండితుల సమక్షంలో ఈ కార్యాలయాన్ని మంత్రోత్సవాలతో ప్రారంభించారు.
*అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం..* *వేద పండితుల మధ్య విప్ విజయరమణ రావు గారికి ప్రముఖుల శుభాకాంక్షలు..* హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియామకమైన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారికి ప్రభుత్వం తరుపున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో అధికారిక కార్యాలయం కేటాయించడం జరిగింది. ఆ కార్యాలయం ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు వేద పండితులు మధ్య ఆదివారం రోజున మంత్రోత్సవాలతో ప్రారంభం చేయడం జరిగింది. ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ తానిపత్రి భాను ప్రసాద్ రావు గారు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వారందరూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారికి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.








