న్యూఢిల్లీ, 2026-06-05
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులు, జల వనరుల నిర్వహణ, పర్యావరణ అనుమతులు, అటవీ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తన నియోజకవర్గమైన పెద్దపల్లి అభివృద్ధి, పారిశ్రామిక ప్రాంతాల అవసరాలు, మౌలిక వసతుల కల్పన, కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
కేంద్ర సహకారం బలోపేతం చేయాలని కోరారు
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అవసరమైన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించాలని కేంద్ర మంత్రులను కోరారు. ఈ చర్చలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.