ప్రధాని నరేంద్ర మోదీ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాలలో బీజేపీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ హయాంలో దేశాభివృద్ధి, పేదల సంక్షేమం గణనీయంగా జరిగిందని తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజల విశ్వాసం వల్లే మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని రఘునాథ్ వెరబెల్లి తెలిపారు.
గత 12 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే అభివృద్ధి, నూతన విమానాశ్రయాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టారని రఘునాథ్ వెరబెల్లి వివరించారు. మంచిర్యాల జిల్లాలో గత పదేళ్లలో కేంద్ర నిధులతో జాతీయ రహదారుల నిర్మాణం, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు జరిగినట్లు తెలిపారు.
దేశ ప్రజల విశ్వాసానికి అనుగుణంగానే బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘునాథ్ గారు మరియు వెంకటేశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ దేశ ప్రజలకు మోదీ గారి పాలన పై విశ్వాసం ఉంది కాబట్టే మూడో సారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అని అన్నారు. దేశ ప్రజలకు మోదీ గారి పాలనపై పెట్టుకున్న విశ్వాసం అనుగుణంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి మరియు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది అని అన్నారు. గత 12 ఏళ్లలో మోదీ గారు ప్రభుత్వం దేశ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్లు రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే అభివృద్ధి, నూతన విమానాశ్రయాల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పన వంటి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టారని తెలిపారు. మంచిర్యాల జిల్లా లో గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల నిర్మాణం, మంచిర్యాల అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాజుల ముకేష్ గౌడ్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వరావు, తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, కస్తూరి నాగరాజు, బోట్ల అనిత, సంజీవరావు, పట్టి వెంకటకృష్ణ, వైద్య శ్రీధర్, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రే చక్రవర్తి, మోటపలుకుల తిరుపతి, బెల్లంకొండ మురళి, డేగ బాపు, మోతె సుజాత, నాంపల్లి శ్రీనివాస్, కమలకరావు, కర్ర లచ్చన్న మరియు తదితరులు పాల్గొన్నారు.








