మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో పార్టీలో చేరారు.
చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి రాజశేఖర్ ఆధ్వర్యంలో జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన నాయకులు పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వేలాల మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకురాలు బుడే రాణి రాజబాపు, బీఆర్ఎస్ మాజీ వార్డు సభ్యుడు జోగిరి రాయమల్లు, విష్ణు భక్తుల రమేష్, బండారి గణేష్, గోదారి నాగరాజు, మాయ మనోహర్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి, రాష్ట్ర నాయకురాలు అర్చన సేనాపతి, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఐద ప్రశాంత్, చెన్నూర్ నియోజకవర్గ నాయకులు రాజేష్, రామ్మోహన్ చారి, మహిళా నాయకురాళ్లు సుమ, రమ తదితరులు పాల్గొన్నారు.








