మంచేరియల్, 26-07-09
శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. సింగరేణి సంస్థకు తడిచెర్ల-2 కోల్ బ్లాక్‌ను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేటాయింపు సంస్థ అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు, ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతుందని ఆయన అన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా, సింగరేణి సంస్థకు తడిచెర్ల-2 కోల్ బ్లాక్‌ను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి శ్రీ కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కేటాయింపు సింగరేణి సంస్థ అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు, ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతుందని రఘునాథ్ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీ దుర్గం అశోక్, శ్రీమతి కందుల సంధ్యారాణి, శ్రీ సునీల్ రెడ్డి, శ్రీ ముకేశ్ గౌడ్, శ్రీ అందుగుల శ్రీనివాస్, శ్రీ పూనమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.












