మంచిర్యాలలోని జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా కమిటీని ప్రకటించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లాలో ఓబీసీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ఓబీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆయా పథకాల ద్వారా ఓబీసీ వర్గాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పార్టీ బలోపేతానికి, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేష్ గౌడ్, ఎంగందుల కృష్ణ మూర్తి, పట్టి వెంకట కృష్ణ, రమణ రావు, రాచర్ల సంతోష్, మద్దర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











